Allari Allari Chupulatho Song Telugu Lyrics Khadgam Movie (2002)
అహ అల్లరి అల్లరి చూపులతో
ఒక గిల్లరి మొదలాయే
ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన
చిరుగిల్లుడు షురువాయే
అరె చెక్కిలి గిలి గిలి గింతాయే
ఈ తిక్క గాలి వలన
మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే
ఈ రాతిరి దయవలన
తాన్న దీన్న తాన్న తన్నినారే
తళాంగు తక్కదిన్నా....అరె
తాన్న దీన్న తాన్న తన్నినారే
తళాంగు తక్కదిన్నా
బుగ్గే నిమురుకుంటే నాకు
అరె మొటిమై తగులుతుంటదే
లేలేత నడుములోని మడత
తన ముద్దుకై వేచి ఉన్నదే
ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ
తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే
మొత్తం నేలమేది మల్లెలన్నీ
తన నవ్వుల్లో కుమ్మరిస్తడే
తాన్న దీన్న తాన్న తన్నినారే
తళాంగు తక్కదిన్నా....అరె
తాన్న దీన్న తాన్న తన్నినారే
తళాంగు తక్కదిన్నా
పేరే పలుకుతుంటే చాలు
నా పెదవే తీయగవుతది
కనుచూపే తాకుతుంటే నన్ను
అబ్బ నా మనసు పచ్చిగవుతది
మెరిసే మెరుపల్లె వానోస్తే అబ్బ
నా గుండెలోన పిడుగు పడుతుంటదే
ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక
నా ఊపిరాగిపోతదే
తాన్న దీన్న తాన్న తన్నినారే
తళాంగు తక్కదిన్నా....అరె
తాన్న దీన్న తాన్న తన్నినారే
తళాంగు తక్కదిన్నా
Song Details:
Movie : Khadgam
Lyrics : Suddhala Ashok Teja
Music : Devi Sri Prasad
Singers : Chitra, Raqueeb Alam
Cast : Ravi Teja, Sonali Bendre, Srikanth